Share News

పాఠశాలల్లో వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 21 , 2024 | 11:37 PM

అమ్మ ఆదర్శ పాఠశాల్లో భాగంగా చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.

పాఠశాలల్లో వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలి
పరిగి జడ్పీహెచ్‌ఎ్‌స నం.01 పాఠశాలలో పనుల ప్రగతి గురించి తెలుసుకుంటున్న కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

పరిగి/బొంరా్‌సపేట్‌, మే 21: అమ్మ ఆదర్శ పాఠశాల్లో భాగంగా చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం పరిగిలోని జడ్పీహెచ్‌ఎ్‌స నం.01, బాలికల పాఠశాల, మండలంలోని సయ్యద్‌మల్కాపూర్‌ పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠశాలల ఆవరణలో చేపట్టిన పనులను పరిశీలించి, మొదటి ప్రాధాన్యం కింద మంచినీటి వసతి, టాయిలెట్స్‌ మరమ్మతులు, విద్యుత్‌ పనులు చేపట్టాలని సూచించారు. పనులకు మంజూరైన నిధులతో నాణ్యతగా పనులు చేయాలని సూచించారు. పాఠశాలల్లోని పనులను పర్యవేక్షిస్తూ స్కూళ్లు తెరిచే లోగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. పాఠశాలల హెచ్‌ఎంలు అత్యవసర పనులను గుర్తించి వాటిని పూర్తి చేయించాలన్నారు. సయ్యద్‌మల్కాపూర్‌ పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఈఈ ఉమేశ్‌, డీపీవో జయసుధ, తహసీల్దార్‌ ఆనంద్‌రావు, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య, ఎంఈవో హరిశ్చందర్‌, హెచ్‌ఎంలు కృష్ణారెడ్డి, గోపాల్‌, రుక్మిణి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌గౌడ్‌ పాల్గొన్నారు. అలాగే బొంరా్‌సపేట్‌ మండలం పూర్యనాయక్‌ తండా పాఠశాల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చేపడుతున్న పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చౌదర్‌పల్లి జెడ్పీ పాఠశాలలో విద్యుత్‌ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పూర్యనాయక్‌తండా పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఆయన వెంట తహసీల్దార్‌ పద్మావతి, ఎంపీడీవో శ్రీదేవి, పంచాయతీరాజ్‌ డీఈ సుదర్శన్‌రావు, హెచ్‌ఎం శ్రీహరిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సూర్యప్రకాశ్‌, సి.యాదగిరి, ప్రత్యేకాధికారి రామ్‌రెడ్డి ఉన్నారు.

విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్సులను సిద్ధం చేయాలి

పాఠశాలల పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ స్కూళ విద్యార్థులకు డ్రెస్సులను సిద్ధం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. పరిగిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్ట శిక్షణ కేంద్రంలో స్టిచింగ్‌ చేస్తున్న స్కూల్‌ డ్రెస్సులపై కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు తీసుకున్న కొలతల ఆధారంగా డ్రెస్సులు కుట్టాలని సూచించారు. స్టిచింగ్‌లో నాణ్యత పాటించాలన్నారు. కలెక్టర్‌ వెంట కమిషనర్‌ వెంకటయ్య, ఎంఈవో హరిశ్చందర్‌, ఏపీఎం శ్రీనివా్‌సరెడ్డి ఉన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:37 PM