Share News

రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:58 PM

రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని నట్టేట ముంచుతోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఆదివారం షాద్‌నగర్‌ పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట రైతు భరోసా రూ. 15వేలు అందజేయాలని కోరుతూ నిరసన, ధర్నా నిర్వహించారు.

రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్‌
షాబాద్‌ : ధర్నాలో మాట్లాడుతున్న పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పాల్గొన్న అవినాష్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు

బీఆర్‌ఎస్‌ నాయకులు

రైతు సంక్షేమాన్ని విస్మరించారని ఆగ్రహం

సీఎం రేవంత్‌ దిష్టిబొమ్మ దహనం

షాద్‌నగర్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని నట్టేట ముంచుతోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఆదివారం షాద్‌నగర్‌ పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట రైతు భరోసా రూ. 15వేలు అందజేయాలని కోరుతూ నిరసన, ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై మాట్లాడుతూ రైతు భరోసాను నమ్ముకొని అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ రైతు సమస్యలను కాంగ్రెస్‌ గాలికొదిలేసిందన్నారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజన్‌, నాయకులున్నారు.

షాబాద్‌ : ఎద్దేడిచిన సేద్యం.. రైతేడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడవని, ప్రస్తుతం కాంగ్రెస్‌ పాలన అలాగే ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు అవినా్‌షరెడ్డి అన్నారు. రైతు భరోసాను ఎత్తివేయడంపై బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు అవినా్‌షరెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరు-ముంబై బైపాస్‌ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ శ్రీనివా్‌సగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, తదితరులున్నారు.

చేవెళ్ల : వానాకాలం రైతుభరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని జిల్లా డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ పెంటోళ్ల కృష్ణారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి దేశమోళ్ల ఆంజనేయులు అన్నారు. బీజాపూర్‌ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్తూర్‌ : బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ధర్నా చేశారు. బి.దేవేందర్‌యాదవ్‌, మాదారం నర్సింహగౌడ్‌, సోమ్లనాయక్‌, నర్సింహారెడ్డి, గోపాల్‌గౌడ్‌, సత్తయ్య, భీమయ్య, జైపాల్‌, రవినాయక్‌, శ్రీశైలం, రాఘవేందర్‌యాదవ్‌ తదితరులున్నారు.

కేశంపేట : రైతుభరోసా నేడు.. రేపు అంటూ కాంగ్రెస్‌ రైతులను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. పల్లె నర్సింగరావు, జగదీశ్వర్‌గౌడ్‌, వెంకటరెడ్డి, నవీన్‌కుమార్‌, మల్లేష్‌యాదవ్‌, తదితరులున్నారు.

ఆమనగల్లు : బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పట్టణంలో బీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యనాయక్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నిరంజన్‌గౌడ్‌, గుత్తి బాలస్వామి, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

కడ్తాల్‌ : బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పరమేశ్‌, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, రైతు సమన్వయ సమితి మాజీ కో-ఆర్డినేటర్‌ వీరయ్య, మాజీ సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహరెడ్డి, తులసీరామ్‌నాయక్‌, హరిచంద్‌ నాయక్‌, కృష్ణయ్య, నర్సింహగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తలకొండపల్లి : మండల కేంద్రంలో రాష్ట్ర నాయకుడు సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌, మండలాధ్యక్షుడు శంకర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

శంషాబాద్‌ : రాష్ట్రాన్ని పాలించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోందని బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాల్కారం సింగిల్‌విండో చైర్మన్‌ సతీష్‌ అన్నారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అధికారం చేపట్టిన కొన్ని మాసాలకే రాష్ట్రాన్ని పాలించే సత్తాలేక సీఎం, మంత్రులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

శంకర్‌పల్లి : ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని శంకర్‌పల్లి సొసైటీ చైర్మన్‌ శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవర్దన్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీతో పాటుగా రైతు భరోసా డబ్బులను అందజేయాలని కోరుతూ శంకర్‌పల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదిభట్ల : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక చర్యలతో నడుస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బొంగ్లూరులో సాగర్‌ రహదారిపై రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

చౌదరిగూడ : కొందుర్గు, జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సయ్యద్‌ హాఫీజ్‌, నాయకులు బాబురావు, చంద్రశేఖర్‌, రాజేష్‌పటేల్‌, శ్రీధర్‌ రెడ్డి, వెంకటేష్‌, అక్రం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 11:58 PM