Share News

కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:06 AM

మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆ పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవాలి
కాంగ్రెస్‌లో చేరిన వారితో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం, ఫిబ్రవరి 5 : మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆ పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని మన్సాన్‌పల్లి గ్రామ ఎల్లమ్మదేవాలయ కమిటీ చైర్మన్‌ మర్యాద మురళీధర్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరవేయడం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యకర్తకు ఎలాంటి అవసరం ఉన్నా అండగా ఉంటానని చెప్పారు. త్వరలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మకమిటీలు వేసి ప్రభుత్వపథకాలను అర్హులైన వారికి చేరవేయడానికి కృ కృషి చేస్తామని చెప్పారు. కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్‌ ఎప్పుడు అన్యాయం చేయదని చెప్పారు. ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీ కె. రఘుమారెడ్డి, మురళీధర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, బాల్‌రాజ్‌, రమేష్‌, రాజు, కృష్ణానాయక్‌, లాజర్‌, వెంకట్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:06 AM