Share News

మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:03 AM

రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం బీజేవైఎం చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్‌ దారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో చేవెళ్ల పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్‌
మాట్లాడుతున్న కుమార్‌ యాదవ్‌

చేవెళ్ల, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం బీజేవైఎం చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్‌ దారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో చేవెళ్ల పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని, రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే ప్రజాపాలన దరఖాస్తులు, హైడ్రా, కుటుంబ సమగ్ర సర్వే తదితర వాటితో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది దరిద్ర పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిసెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ప్రతీ మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ట్రైనింగ్‌ సెల్‌ కన్వీనర్‌ సుజేంద్రశర్మ, చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్‌ వైభవ్‌రెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఎం. మధుకర్‌రెడ్డి, మొయినాబాద్‌, షాబాద్‌ మండలాధ్యక్షులు శ్రీకాంత్‌, మహేశ్‌, చేవెళ్ల టౌన్‌ అధ్యక్షుడు శ్రీతంరెడ్డి, నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:03 AM