Share News

కాంగ్రెస్‌ అంటేనే కన్ఫ్యూజన్‌ పార్టీ

ABN , Publish Date - May 21 , 2024 | 12:29 AM

కాంగ్రెస్‌ అంటేనే ఒక కన్ఫ్యూజన్‌ పార్టీ అని, ఆ పార్టీ నాయకుల్లో ఎప్పుడు ఎవరేం మాట్లాడుతారో, ఎవరిని సమర్థిస్తారో, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ అంటేనే కన్ఫ్యూజన్‌ పార్టీ
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఢిల్లీలో ఎన్నికల ప్రచారం

రంగారెడ్డి అర్బన్‌, మే 20 : కాంగ్రెస్‌ అంటేనే ఒక కన్ఫ్యూజన్‌ పార్టీ అని, ఆ పార్టీ నాయకుల్లో ఎప్పుడు ఎవరేం మాట్లాడుతారో, ఎవరిని సమర్థిస్తారో, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీలో అంతా గందరగోళమే అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో ఎన్నికలు జరిగే ఢిల్లీలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో సోమవారం విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల లోక్‌సభ స్థానం ప్రజలు అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు రాని చోట బీజేపీకి భారీ మెజార్టీ రానుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. 31శాతం దళితులే ఉన్న రాయ్‌బరేలి నియోజకర్గంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ వర్గానికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వలేదన్నారు. ఆ స్థానాన్ని గాంధీ కుటుంబానికి రిజర్వ్‌ చేసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయాలని గగ్గోలుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ అదే లిక్కర్‌ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతివ్వడం హాస్యాస్పందం అన్నారు. దేశ రాజధాని ప్రజలంతా బీజేపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - May 21 , 2024 | 12:30 AM