Share News

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:35 AM

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో వారు పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

కులకచర్ల, ఏప్రిల్‌ 24: కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో వారు పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడినవారు ఎవ్వరు కూడా బిల్లు చెల్లించరాదని, బలవంతంగా ఎవరైనా అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ మొగులయ్య, బ్లాక్‌బీ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్‌, నాయకులు రాములు, ఆనందం, లాల్‌కృష్ణ, బాలముకుందం, కుమ్మరి స్వామి, యాదయ్య, నర్సిములు, స్థానిక ఎంపీటీసీ ఆనందం, వెంకటేశ్‌ కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం

రాజేంద్రనగర్‌, (ఆంధ్రజ్యోతి): బీజేపీ విద్వేషాలు రగిలించి మతాల మధ్య చిచ్చు పెడుతోందని, చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలార్‌ దేవులపల్లి డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ధనంజయ్‌ ఆధ్వర్యంలో సీతారెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారెడ్డి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేసి రంజిత్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలతో ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మాటిస్తే తప్పదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఆమె తెలిపారు.

రంజిత్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి

కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైౖర్మన్‌ బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు. చేవెళ్ల ప్రాంతానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని, కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సూర్‌రెడ్డి సాయిరెడ్డి, బొల్ల వెంకటేశ్‌, బ్లాక్‌ ప్రెసిడెంట్‌ మూముద్‌, కాలిక్‌, వెంకటేశ్‌, లక్ష్మణ్‌, శ్రీశైలం, రత్నం, శ్రీనివాస్‌, శివ, సతీష్‌, గంగయ్య, అశోక్‌, సద్గుణచారి, ఉస్మాన్‌, పాండు కిశోర్‌, బాబు, నరసింహ యాదవ్‌, ఓం ప్రకాష్‌, రాజ్‌కుమార్‌, యాదయ్య, సవితారెడ్డి, గీత, ఫరీద్‌, జుబేద్‌, దస్తగీర్‌, ఆంజనేయులు, శారద, మమత, ప్రియాంక, మహేశ్‌, శ్రీనివాస్‌, రాజిరెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపి, నాగరాజ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:35 AM