Share News

బీఆర్‌ఎ్‌సలో కలకలం!

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:08 PM

ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధం అయ్యారా? అంటే అవుననే సంకేతాలొస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో పాలక కాంగ్రెస్‌ పార్టీలో చేరికలపై దృష్టి సారించింది.

బీఆర్‌ఎ్‌సలో కలకలం!

సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ భేటీ

త్వరలో కాంగ్రె్‌సలో చేరిక? అదే బాటలో మరి కొందరు!?

కాంగ్రె్‌సలో చేరిక అవాస్తవం : ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 28 : ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధం అయ్యారా? అంటే అవుననే సంకేతాలొస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో పాలక కాంగ్రెస్‌ పార్టీలో చేరికలపై దృష్టి సారించింది. బీఆర్‌ఎ్‌సలోని ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకుపోయే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎంను కలవడం కలకలం రేపింది. తాజాగా ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. గంట సేపు సీఎంతో ఎమ్మెల్యే చర్చలు జరపడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రకాశ్‌గౌడ్‌ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, రేవంత్‌రెడ్డితో దగ్గరి పరిచయాలు ఉండడం ఈ సందర్భంగా గమనార్హం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కక్కరుగా సీఎంను కలుస్తుండడం వెనక కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్శకు తెరలేపిందా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్నాయి. త్వరలో ప్రకాశ్‌గౌడ్‌ కాంగ్రె్‌సలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. సీనియర్‌ ఎమ్మెల్యే అయిన ఆయన బీసీ కోటాలో మంత్రి పదవి సైతం ఆశిస్తున్నట్లు సమచారం. ప్రకాశ్‌గౌడ్‌ బాటలోనే మరి కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాను కాంగ్రె్‌సలో చేరినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రకాశ్‌గౌడ్‌ ఖండించారు. తన నియోజకవర్గంలోని రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ, బహద్దూర్‌గూడ, ఘన్సిమియాగూడ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరేందుకే తాను సీఎంను కలిశానని ఈ సందర్భంగా ప్రకాశ్‌గౌడ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:08 PM