ముగిసిన వీహెచ్‌పీ న్యాయవాదుల జాతీయ సమావేశాలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:02 AM
శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో గల త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో రెండు రోజుల పాటు నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ న్యాయవాదుల విభాగ 3వ జాతీయ సమావేశాలు ఆదివారం ముగిశాయి.
శంషాబాద్ రూరల్, జూలై 14: శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో గల త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో రెండు రోజుల పాటు నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ న్యాయవాదుల విభాగ 3వ జాతీయ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాలను శనివారం చిన జీయర్ స్వామి ప్రారంభించారు. వీహెచ్‌పీ కేంద్రీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి సురేంద్రజైన్, లీగల్ సెల్ జాతీయ కన్వీనర్ దిలీప్ త్రివేది, కో-కన్వీనర్ అభిషేక్, శ్రీనివాస్, పలువురు సుప్రీం కోర్టు, హైకోర్టుల మాజీ జడ్జిలు, వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాల అజమాయిషీ నుంచి హిందూ ఆలయాలను విడిపించేందుకు చేపట్టాల్సిన న్యాయ ప్రక్రియ, వక్ఫ్ బోర్డు దురాక్రమణలకు అడ్డుకట్ట వేయడం, రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని రద్దు చేయడం, దేశంలో ప్రమాదకరంగా మారిన జనాభా అసమతుల్యత, కామన్ పాపులేషన్ పాలసీ, యూనిఫాం సివిల్ కోడ్ అమలు, ముస్లిం రిజర్వేషన్ రద్దు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అమలువుతున్న చట్టాలపై వీహెచ్‌పీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టేందుకు తీర్మానించినట్లు తెలిపారు. జాతీయ సమావేశాల్లో వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జస్మత్, రాష్ట్ర కో-కన్వీనర్లు నర్సింహారావు, రాధికాశర్మ, శ్యామ్‌సుందర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.