Share News

వెబ్‌ క్యాస్టింగ్‌ స్ర్కీనింగ్‌ రూములను పరిశీలించిన కలెక్టర్‌

ABN , Publish Date - May 17 , 2024 | 12:46 AM

వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా స్ర్కీనింగ్‌ రూమ్‌లను చేవెళ్ల పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శశాంక పరిశీలించారు.

వెబ్‌ క్యాస్టింగ్‌ స్ర్కీనింగ్‌ రూములను పరిశీలించిన కలెక్టర్‌
వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శశాంక

చేవెళ్ల, మే 16 : వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా స్ర్కీనింగ్‌ రూమ్‌లను చేవెళ్ల పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శశాంక పరిశీలించారు. గురువారం చేవెళ్ల మం డల పరిధిలోని గొల్లపల్లిలో ఉన్న బండారు శ్రీనివాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల లో పోల్డ్‌ ఈవీఎంలను భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూంలను వెబ్‌ క్యాస్టింగ్‌ స్ర్కీని ంగ్‌ ద్వారా కలెక్టర్‌ పరిశీలించారు. మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఈ ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపర్చారు. ఈవీఎంలకు వేసిన సీళ్లను సీసీ కెమెరాల ద్వారా ఆర్వో పరిశీలించారు. స్ర్టాంగ్‌ రూంలు, వాటి పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను గమనించారు. నిఘా కోసం అమర్చి న క్లోజ్డ్‌ సర్క్యూట్‌ కెమెరాల పనితీరు, వాటి ద్వారా కొనసాగుతున్న పర్యవేక్షణను పరిశలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట చేవె ళ్ల, కందుకూర్‌ ఆర్డీవోలు సాయిరామ్‌, సూరజ్‌కుమార్‌, చేవెళ్ల ఏసీపీ బంటు కిషన్‌, తహసీల్దార్‌ కృష్ణయ్య, సీఐ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:46 AM