Share News

తహసీల్దార్‌ పేరుతో డబ్బు వసూలు.. వ్యక్తిపై కేసు

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:32 AM

తహసీల్దార్‌ పేరు చెప్పి రూ.2లక్షల వసూలు చేసిన మోసగాడిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

తహసీల్దార్‌ పేరుతో డబ్బు వసూలు.. వ్యక్తిపై కేసు
మహేందర్‌రెడ్డి

మేడ్చల్‌ టౌన్‌, జూన్‌ 26: తహసీల్దార్‌ పేరు చెప్పి రూ.2లక్షల వసూలు చేసిన మోసగాడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మండలంలోని సోమారం పరిధి గంగాస్థాన్‌ వెంచర్‌ నిర్వాహకుల వద్ద నుంచి పూడూరుకు చెందిన మహేందర్‌రెడ్డి తాను తహసీల్దార్‌ కార్యలయం నుంచి వచ్చానని, తహసీల్దార్‌ పంపినట్టు నమ్మించి వెంచర్‌ యజమానుల నుంచి రూ.రెండు లక్షలు వసులు చేశాడు. మమేందర్‌రెడ్డిపై అనుమానంతో వెంచర్‌ నిర్వాహకులు చెక్కు ఇచ్చారు. వ సూళ్లకు అలవాటు పడ్డ మహేందర్‌రెడ్డి వెంచర్‌ వారితో మాట్లాడి వెంచర్‌ స్థలం వివాదంలో ఉందని, దాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్‌ స్థాయి వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. అందుకు రూ.3కోట్టు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో వెంచర్‌ నిర్వాహకులు అంత డబ్బులు ఇవ్వలేమని, కోటిన్నర ఇవ్వగలమంటూ నమ్మించి నేరుగా మేడ్చల్‌ తహసీల్దార్‌ శైలజను కలిసి మహేందర్‌రెడ్డి గురించి వివరించారు. దీంతో తన పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడంటూ, మహేందర్‌రెడ్డిపై తహసీల్దార్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 27 , 2024 | 08:37 AM