రేపు నల్సర్‌కు సీఎం, హైకోర్టు సీజే రాక
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:05 AM
శామీర్‌పేటలోని నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయంలో 6న సాయంత్రం 4గంటలకు క్యాపిటల్ ఫౌండేషన్ వార్షిక ప్రసంగం, నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ శ్రీకృష్ణదేవరావు గురువారం తెలిపారు.

శామీర్‌పేట, జులై 4: శామీర్‌పేటలోని నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 6న సాయంత్రం 4గంటలకు క్యాపిటల్ ఫౌండేషన్ వార్షిక ప్రసంగం, అవార్డుల ప్రదానోత్స వాన్ని నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ శ్రీకృష్ణదేవరావు గురువారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గౌరవ అతిథులుగా వర్సిటీ చాన్స్‌లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరదే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకటరమణి రానున్నారని చెప్పారు.