మేడ్చల్ చెక్‌పోస్టు చౌరస్తా డివైడర్ మూసివేత
ABN , Publish Date - Jan 21 , 2024 | 11:51 PM
హైదరాబాద్-నాగర్‌పూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మేడ్చల్ పట్టణం చెక్‌పోస్టు వద్ద నిర్మిస్తున్న రహదారి వంతెన పనులకు ఆటంకం కలిగిస్తున్న యూటర్న్‌ను జాతీయ రహదారుల అధికారులు బారిగెట్లు పెట్టి మూసివేశారు.
మేడ్చల్ టౌన్, జనవరి 21: హైదరాబాద్-నాగర్‌పూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మేడ్చల్ పట్టణం చెక్‌పోస్టు వద్ద నిర్మిస్తున్న రహదారి వంతెన పనులకు ఆటంకం కలిగిస్తున్న యూటర్న్‌ను జాతీయ రహదారుల అధికారులు బారిగెట్లు పెట్టి మూసివేశారు. గండిమైసమ్మ వెళ్లాలనుకునే వాహనదారులు పారిశ్రామికవాడ డివైడర్ నుంచి లేక, రింగ్ రోడ్డు సమీపంలోని సర్వీసు రోడ్డు జంక్షన్ మీదుగా గండి మైసమ్మకు చేరుకునే విధంగా వీలు కల్పించారు. కాగా గండి మైసమ్మ నుంచి మేడ్చల్ చెక్‌పోస్టు వరకు వచ్చే వాహనాలు నేరుగా వచ్చేవిధంగా వీలు కల్పించారు. రహదారి వంతెన పనులు పూర్తయ్యేంత వరకు గండిమైసమ్మ వెళ్లే వాహనదారులు ఇకపై రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న సర్వీసు రోడ్డు లేదా, పారిశ్రామిక వాడ సమీపంలోని యూటర్న్ నుంచి రోడ్డు దాటి వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.