బార్‌లో ఘర్షణ.. బీరు సీసాతో వ్యక్తిపై దాడి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:37 PM
షాద్‌నగర్ పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం మత్తులో ఓ యువకుడిపై మరో వ్యక్తిపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..

షాద్‌నగర్ రూరల్, జూన్ 7: షాద్‌నగర్ పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం మత్తులో ఓ యువకుడిపై మరో వ్యక్తిపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి రేటికల్ నందీశ్వర్, శివకుమార్, అనిల్‌కుమార్‌లు మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్ తన ఫోన్‌పై ఓ రాజకీయ నేత ఫొటోను కలిగి ఉండటంతో గమనించిన శివకుమార్ దానిని తొలగించాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరగడంతో నందీశ్వర్ ఆగ్రహంతో లేచి అనిల్‌కుమార్ తలపై బీర్ బాటిల్‌తో కొట్టాడు. అక్కడ ఉన్నవాళ్లు సర్ధి చెప్పడానికి యత్నించినా మరోసారి దాడి చేశాడు. దాంతో అనిల్‌కుమార్‌కు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్పు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ప్రతా్‌పలింగం తెలిపారు.