బడిఈడు పిల్లలను బడుల్లో చేర్పించాలి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:39 PM
బడీడు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ తల్లిదండ్రులను కోరారు. ప్రో.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెండో రోజు మండల పరిధిలోని చెర్లటేల్‌గూడ గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

‘బడిబాట’లో అధికారులు, ఉపాధ్యాయులు
ఇబ్రహీంపట్నం, జూన్ 7: బడీడు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ తల్లిదండ్రులను కోరారు. ప్రో.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెండో రోజు మండల పరిధిలోని చెర్లటేల్‌గూడ గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ మహిళా సమాఖ్య ఆద్వర్యంలో కొనసాగుతున్న పాఠశాల విద్యార్థుల యూనిఫాం స్టిచింగ్ సెంటర్‌ను పరిశీలించారు. నిర్ణీత సమయంలోగా యూనిఫాం అందించాలని మహిళలను కోరారు. కర్నంగూడలో నర్సరీని పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీటీసీ ఆంజనేయులు, గ్రామ ప్రత్యేకాధికారి జి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మాడ్గుల : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని ఎంఈవో సర్ధార్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇర్విన్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఎంఈవో కోరారు
ఆమనగల్లు : బడీడు పిల్లలను బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. మున్సిపాలిటీలోని నుచ్చుగుట్ట తండాలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి తండాలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్య ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను పనులకు పంపకుండా పాఠశాలలకు పంపి చక్కటి విద్యాబుద్దులు నేర్పించాలని కోరారు. కార్యక్రమంలో అమ్మదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీకృష్ణనాయక్, ఉపాధ్యాయురాలు శివలీల, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
యాచారం : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన చేస్తున్నామని, పాఠ్యపుస్తకాలు ఇస్తున్నామని, రెండు జతల దుస్తులిస్తున్నామని, పౌష్టికాహారం అందిస్తున్నామని, మీ పిల్లలను బడివకి పంపండి నిఇ కోరుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాద్యాయులు ఇల్లిల్లూ తిరిగి తల్లిదండ్రులను కోరారు. ఈమేరకు బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఉపాధ్యాయలు కోరారు. బడిబాట కార్యక్రమం కుర్మిద్ద, తాటిపర్తి తదితర గ్రామాల్లో నిర్వహించారు. ఆ యా గ్రామాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రతీ బడి లో అన్నిరకాల వసతులు కల్పించడం జరుగుతుందని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు.
చౌదరిగూడ : ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధించబడుతుందని మండల ఇన్‌చార్జి ఎంఈవో కృష్టారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో రెండవ రోజు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వామే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను, యూనిఫాంలను పంపిణి చేస్తుందన్నారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, చౌదరిగూడ ఇన్‌చార్జీ హెచ్‌ఎం విల్సన్ సునీల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.