Share News

చేవెళ్ల సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:58 PM

చేవెళ్ళలో నేడు మంగళవారం జరగనున్న కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభకు భారీ ఎత్తును తరలివచ్చి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి కోరారు.

చేవెళ్ల సభను విజయవంతం చేయాలి
పరిగిలో విలేకరులతో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి,ఫిబ్రవరి 26: చేవెళ్ళలో నేడు మంగళవారం జరగనున్న కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభకు భారీ ఎత్తును తరలివచ్చి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి కోరారు. పరిగిలోని తన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఆగ్రనాయకురాలు ప్రియాంకగాంఽధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఈ సభకు హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందుకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగంగా చేవెళ్ల సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్ష మందితో సభను నిర్వహిస్తున్నామని, పరిగి నుంచే పది వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ కార్యదర్శులు బి.బీంరెడ్డి, కె.హన్మంత్‌, పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, పరిగి, దోమ, కులకచర్ల, చౌడాపూర్‌, గండీడ్‌ మండలాల అధ్యక్షులు బి.పరుశరాంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, బీఎస్‌ ఆంజనేయులు, అశోక్‌, జితేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, తావుర్యానాయక్‌, రాములునాక్‌ పాల్గొన్నారు.

తాండూరు నుంచి 20వేల మంది కార్యకర్తలు..

తాండూరురూరల్‌: చేవెళ్లలో నేడు(మంగళవారం) నిర్వహించే కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభకు తాండూరు నియోజకవర్గం నుంచి 20వేల మంది కార్యకర్తలను తరలిస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బొంకూరు గ్రామంలో శివాలయాన్ని సందర్శించిన అనంతరం సోమవారం విలేకరులతో మాట్లాడారు. బొంకూరు, బిజ్వార్‌ గ్రామాల మధ్య కాగ్నా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్‌రెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారని తెలిపారు. ప్రస్తుతం ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ విలేకరులు ప్రశ్నించగా ప్రస్తుతం నిధులు లేవని, గతంలో పూర్తిస్థాయిలో నిధులు లేక ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారని అన్నారు. అన్నిగ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కిందసీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురికాకుండా తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ముఖ్య ఉద్దేమన్నారు. చేవెళ ్ల భారీ బహిరంగసభకు తాండూరు నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలంతా ముందుకువచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పెద్దేముల్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు జితేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, కొమ్ము గోపాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:58 PM