Share News

చేవెళ్ల పార్లమెంట్‌ బీజేపీదే

ABN , Publish Date - May 14 , 2024 | 11:36 PM

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీదేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్‌ అన్నారు.

చేవెళ్ల పార్లమెంట్‌ బీజేపీదే
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌

తాండూరు, మే 14: చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీదేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్‌ అన్నారు. తాండూరులో మంగళవారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో పార్లమెంట్‌ ఎన్నికలపై సమీక్షించిన అనంతరం మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీజేపీ అధిక మెజారిటీని సాధిస్తుందన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలలుగా చిత్తశుద్ధితో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు బాలి శివకుమార్‌, గాజుల శాంతికుమార్‌ పాల్గొన్నారు.

మల్కాజిగిరిలో ఈటల గెలుపు ఖాయం

ఘట్‌కేసర్‌ రూరల్‌: మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని అ పార్టీ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు, కార్యదర్శి రాచకట్ల శ్రీశైలం ధీమా వ్యక్తంచేశారు. ఎదులాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌ గెలుపును ఎవరూ అపలేరని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీకి ఓటువేశారని గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని, మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని తెలిపారు. ఘట్‌కేసర్‌లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని, అన్ని వర్గాల ప్రజలు ఈటలకే ఓటువేశారని తెలిపారు. ఈటల రాజేందర్‌ గెలుపునకు నిరంతరం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేశారని తెలిపారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ఈటలకు ఓటువేసిన మండల ప్రజలకు ఆయనధన్యవాదాలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. బీజేపీపై ఉన్న నమ్మకంతో ప్రజలు ఈటల రాజేందర్‌కు స్వచ్ఛందంగా ఓటు వేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు గ్యార చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2024 | 11:36 PM