Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ టికెట్లు ఎవరికి?

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:26 AM

బీఆర్‌ఎ్‌సలో చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ టికెట్లు ఎవరికిస్తారనే విషయం సస్పెన్స్‌గా మారింది. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో టికెట్ల తీసుకునేందుకు సీనియర్లు మోహం చాటేస్తున్నట్లు సమాచారం.

చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ టికెట్లు ఎవరికి?

బీఆర్‌ఎ్‌సలో సస్పెన్స్‌గా మారిన లోక్‌సభ స్థానాల టికెట్ల వ్యవహారం

చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి ఎన్నికల్లో పోటీపై అనిశ్చితి

మల్కాజిగిరిలో తెరపైకి రోజుకో పేరు

ప్రత్యామ్నాయ నేతలపై అన్వేషణ

చేవెళ్ల పరిశీలనలో పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మల్కాజిగిరిలో కాసాని వీరేశ్‌లపై గురి!

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : బీఆర్‌ఎ్‌సలో చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ టికెట్లు ఎవరికిస్తారనే విషయం సస్పెన్స్‌గా మారింది. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో టికెట్ల తీసుకునేందుకు సీనియర్లు మోహం చాటేస్తున్నట్లు సమాచారం. దీంతో అధిష్టానానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వాస్తవానికి చేవెళ్లలో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి అధిష్టానం టికెట్‌ ఖరారు చేసి ంది. కానీ.. మారిన పరిస్థితుల్లో ఆయన పోటీకి అసక్తి చూపడం లేదని సమాచారం. పోటీచేయాలని బీఆర్‌ఎస్‌ పెద్దలు రంజిత్‌రెడ్డిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా ఆయన తన నిర్ణయం మార్చుకోలేదని, పోటీ చేయనని తేల్చి చెప్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో బీఆర్‌ఎస్‌ చేవెళ్ల ఎంపీ టికెట్‌ విషయంలో ప్రత్యామ్నాయ పేర్లను ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కొప్పుల మహేశ్‌రెడ్డి, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. పోటీకి ఆసక్తి ఉన్నవారిపై కేటీఆర్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. తమకు ఆసక్తి లేదని మాజీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ఇంతకు ముందు నేతలు పోటీ పడేవారు. కానీ.. ఇప్పుడు పిలిచి టికెటిస్తామన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్‌ లోక్‌సభ ఎన్నికలపై రివ్యూలు చేశారు. మొదట రివ్యూ చేసిన స్థానం చేవెళ్ల. ఎంపీ రంజిత్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన కూడా పోటీకి సిద్ధం అయ్యారు. కానీ.. చేవెళ్లలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బలమైన నేత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి దంపతులు, అలాగే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. చేవెళ్ల బీజేపీ టికెట్‌ కె.విశ్వేశ్వర్‌రెడ్డికి ఖరారైంది. రంజిత్‌రెడ్డి ఆసక్తి చూపకపోవడంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం మాజీ మంత్రి సబితారెడ్డి తనయడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పేరు పరిశీలిస్తోంది. మల్కాజిగిరిలో పోటీకి సీనియర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రెండు రోజుల కిందట కాసాని జ్ఞానేశ్వర్‌ తనయుడు వీరేశ్‌ను తెలంగాణ భవన్‌కు పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడి పోటీ చేయాలపి చెప్పినట్లు తెలిసింది. పోటీపై కాసాని కుటుంబం ఏ నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది.

Updated Date - Mar 04 , 2024 | 12:26 AM