Share News

ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:01 AM

వైద్య వృత్తిలో ఎలాంటి అనుభవం లేకున్నా ఎంబీబీఎస్‌ డాక్టర్లమంటూ రోగులకు వైద్యం అందిస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 : వైద్య వృత్తిలో ఎలాంటి అనుభవం లేకున్నా ఎంబీబీఎస్‌ డాక్టర్లమంటూ రోగులకు వైద్యం అందిస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా, పోచారం మున్సిపల్‌, నారపల్లి-కొర్రెముల రోడ్డులో అనుభవం లేకున్నా ఎంబీబీఎస్‌ డాక్టర్లమంటూ ఆర్‌ఆర్‌ క్లినిక్‌ నడుపుతున్న రవీందర్‌రెడ్డి, డీబీఎం క్లినిక్‌ నడుపుతున్న నరేందర్‌లపై రాష్ట్ర వైద్య మండలి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ హనుమంత్‌రావు, టీఎస్‌ వీసీ విజిలెన్స్‌ అధికారులతో కలిసి బుధవారం దాడిచేశారు. ఎంబీబీఎస్‌ డాక్టర్లమని చెప్పుకుంటూ రోగులకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్లు వారు గుర్తించారు. కనీస అర్హతలు లేకుండానే రోగులకు చికిత్స చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్లు లేకుండానే క్లినిక్‌లు నడుపుతూ ప్రజల వద్ద డబ్బులు దండుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ఇద్దరిపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో రాష్ట్ర వైద్యమండలి అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 07:52 AM