Share News

సమస్య తీరేనా?

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:00 AM

వికారాబాద్‌ పట్టణంలో జనాభా రోజురోజుకు పెరుగుతుండగా అదేస్థాయిలో ట్రాఫిక్‌ కూడా పెరిగిపోతోంది.

సమస్య తీరేనా?
వికారాబాద్‌లో ట్రాఫిక్‌

  • రోడ్లపై తోపుడు బండ్లు

  • స్తంభిస్తున్న ట్రాఫిక్‌

  • పట్టించుకోని పాలకులు, అధికారులు

వికారాబాద్‌, జూలై 7: వికారాబాద్‌ పట్టణంలో జనాభా రోజురోజుకు పెరుగుతుండగా అదేస్థాయిలో ట్రాఫిక్‌ కూడా పెరిగిపోతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో రోడ్లు పూర్తిగా రద్దీతో కన్పిస్తున్నాయి. అయితే వికారాబాద్‌ పట్టణంలో ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి బీజేఆర్‌, మహాశక్తి, ఎంఆర్‌పీ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా పండ్ల వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. వారే సగంరోడ్లను అక్రమిస్తుండడంతో వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో పండ్ల వ్యాపారులకు మార్కెట్‌ స్థలం కేటాయించి అందులో పండ్లు అమ్ముకోవాలని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలు మాత్రం ఎవరూ ఆచరణలో పెట్టలేదు. సమస్య వచ్చినప్పుడే చర్చించుకోవడం తప్పా ఆ తర్వాత రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల ఎక్కడి సమస్య అక్కడే ఉండిపోతోంది. ఓట్లకోసం రాజకీయ నాయకుడు వారిని అక్కడి వారి బండ్లను తొలగించక పోవడంతో పట్టణం నిత్యం ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతుంది. పోలీసు శాఖ, మునిసిపల్‌ శాఖ సమన్వయంతో ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న తోపుడు బండ్లను తొలగిస్తే పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తొలగిపోతాయని అదే సమయంలో వ్యాపారులకు సైతంనష్టం జరుగకుండా వారికి కూడా మంచి స్థలం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:00 AM