Share News

వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం

ABN , Publish Date - May 12 , 2024 | 12:17 AM

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు.

వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం
మెట్లకుంటలో కాంగ్రెస్‌ నాయకుల ప్రచారం

బొంరాస్‌పేట్‌, మే 11: మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. బొంరాస్‌పేట్‌, మెట్లకుంట, దుద్యాల, లగచర్ల గ్రామాల్లో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బొంరాస్‌పేట్‌, తుంకిమెట్ల గ్రామాల్లో ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి హాజరై ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వంశీచంద్‌రెడ్డి గెలుపునకు చేయి గుర్తుకు ఓటే యాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నర్సింహులు గౌడ్‌, జయకృష్ణ, వెంకట్రాములుగౌడ్‌, రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, అంజిల్‌ రెడ్డి, వీరేశం, సంతోష్‌ పాల్గొన్నారు. కాగా, మేడిచెట్టు తండా గ్రామ పంచాయతీ బోడబండ తండాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. తండాకు చెందిన సంజునాయక్‌, రవి నాయక్‌, రతన్‌నాయక్‌, బాల్యనాయక్‌, సంతోష్‌ నాయక్‌ తదితరులు శనివారం కాంగ్రెస్‌ కొడంగల్‌ ఇంచార్జ్‌ తిరుపతిరెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

Updated Date - May 12 , 2024 | 12:17 AM