Share News

ప్రశాంతంగా ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:01 AM

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తాండూరు పట్టణంలోని ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎగ్జామినేషన్స్‌ కస్టోడియన్స్‌ మల్లినాథప్ప, కృష్టయ్యలు అన్నారు.

ప్రశాంతంగా ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు
తాండూరు రూరల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలోకి క్యూలో వెళ్తున్న విద్యార్థులు

తాండూరురూరల్‌, ఫిబ్రవరి 29: ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తాండూరు పట్టణంలోని ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎగ్జామినేషన్స్‌ కస్టోడియన్స్‌ మల్లినాథప్ప, కృష్టయ్యలు అన్నారు. మొత్తం 2040మంది విద్యార్థులకు గానూ 2013మంది పరీక్షలు రాయగా 35మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 1507 గానూ 1482 మంది హాజరుకాగా, 25మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో మొత్తం 541 మందికి గాను 531మంది విద్యార్థులు పరీక్షరాయగా, పది మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షా కేంద్రాలను తాండూరు తహసీల్దార్‌ తారాసింగ్‌, డీఎస్పీ బాలకృష్ణారెడ్డిలు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. అయితే నిమిషం నిబంధనలో ఎవరూ ఆలస్యంగా రాకుండా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నట్లు కస్టోడియన్స్‌ తెలిపారు.

పరిగి: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. పరిగి పట్టణంలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రెసిడెన్షియల్‌, విజ్ఞాన్‌, పల్లవి జూనియర్‌, మోడల్‌ స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటలకు పరీక్షలు ఉండగా, రెండవరోజు గంట ముందుకు 8గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరిగిలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో 1330మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 36మంది విద్యార్థులు గైరాజరయ్యారు. 1294మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

కులకచర్ల: కులకచర్లలోని రామలింగేశ్వర కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలకు 224 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరయ్యారు. వివేకానంద కళాశాలలో 166 మందికి ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్‌లు కామేశ్వరి, రాములు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 12:01 AM