Share News

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తప్పని పరిస్థితుల్లోనే సిజేరియన్‌ చేయాలి

ABN , Publish Date - May 30 , 2024 | 12:24 AM

లోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ డెలవరీలు చేయాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్‌కు వెళ్లాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్‌కుమార్‌ అన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తప్పని పరిస్థితుల్లోనే సిజేరియన్‌ చేయాలి

వికారాబాద్‌, మే 29: జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ డెలవరీలు చేయాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్‌కు వెళ్లాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్‌కుమార్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని గాయత్రి నర్సింగ్‌ హోమ్‌ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అక్కడ సిజేరియన్‌ ప్రసవాలే ఎక్కువగా జరిగినట్లుగా గుర్తించారు. పేషెంట్ల కేస్‌ షీట్లను కూడా అసంపూర్తిగా నమోదు చేసినట్లు గుర్తించి యాజమాన్యంతో మాట్లాడి సక్రమంగా కేస్‌ షీట్లు రాయాలని నోటీసు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీ-సెక్షన్‌ నిబంధనలు ఉల్లంఘించిన గైనకాలజిస్టులు, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపైనా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. తనిఖీల్లో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సాయిబాబ, శ్రీనివాసులు డిప్యుటీ మాస్‌ మీడియా అధికారి పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 09:12 AM