Share News

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:49 AM

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పోచారం పరిధి చోటుచేసుకుంది.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 2: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పోచారం పరిధి చోటుచేసుకుంది. ఐటీసీ స్టేషన్‌ సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొర్రెముల, లక్ష్మీనగర్‌లో ఉండే కొత్తకోట హృదయ్‌కుమార్‌రెడ్డి ఇం టికి తాళం వేసి కుటుంబీకులతో గత నెల 30న నగరంలోని కేపీహెచ్‌బీ కాలనికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి వచ్చిచూడగా ఇంటి తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో దాచిన తులంన్నర బంగారు ఆభరణాలు, 50వేల నగదు చోరీ అయినట్టు నిర్దారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - Jan 03 , 2024 | 12:49 AM