Share News

కుర్మిద్దలోని ఓ ఇంట్లో చోరీ

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:21 PM

బ్రహీంపట్నంలో విందుకెళ్లి ఇంటికొచ్చే సరికి ఇల్లు గుల్ల అయిన ఘటన హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీ్‌సస్టేషన్‌ పరిధి కుర్మిద్దలో చోటుచేసుకుంది.

కుర్మిద్దలోని ఓ ఇంట్లో చోరీ

యాచారం, జూన్‌ 9: ఇబ్రహీంపట్నంలో విందుకెళ్లి ఇంటికొచ్చే సరికి ఇల్లు గుల్ల అయిన ఘటన హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీ్‌సస్టేషన్‌ పరిధి కుర్మిద్దలో చోటుచేసుకుంది. కుర్మిద్దకు చెందిన మడ్డి వెంకటయ్య కుటుంబీకులు శనివారం సాయంత్రం బ్రహీంపట్నంలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన విందుకు వెళ్లారు. అర్ధరాత్రి దొంగలు ఇంట్లో ప్రవేశించి అరతులం బంగారు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ.5వేల నగదు ఎత్తుకపోయినట్టు బాధితు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:21 PM