Share News

బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:30 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో మండలంలో బీజేపీకి లీడ్‌ రావటంతో అధికా ర కాంగ్రెస్‌ ఖంగుతింది.

బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ

మూడో స్థానానికి దిగజారిన కారు పార్టీ

ధారూరు, జూన్‌ 5: పార్లమెంట్‌ ఎన్నికల్లో మండలంలో బీజేపీకి లీడ్‌ రావటంతో అధికా ర కాంగ్రెస్‌ ఖంగుతింది. మరో వైపు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ధారూరు మ ండలం కాంగ్రె్‌సకు కంచుకోటగా నిలిచి మెజారీటి ఇచేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన త ర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితా లు మాత్రం కాంగ్రె్‌సకు షాకిచ్చాయి. మం డలంలో కాంగ్రె్‌సపై బీజేపీకి 153 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరడం, బీఆర్‌ఎస్‌ ఓ టు బ్యాంకును బీజేపీకి మళ్లించటంతో మో జారీటీ సాధించిందనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు రెండు రోజల ముందు నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీకే ఓటు వేయాలని గ్రామాల్లో బహిరంగంగానే ప్రచారం చే శారని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. మండలంలో బీజేపీకి 12,197 ఓట్లు, కాంగ్రె స్‌కు 12,044ఓట్లు రాగా, బీఆర్‌ఎ్‌సకు 2,163 ఓట్లే వచ్చాయి. కొందరు కాంగ్రెస్‌ నాయకులు లోపాయికారిగా బీజేపీ ఓట్లు వేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది.ఇలాంటి నాయకులతో పార్టీకి నష్టం అని అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ వ్యవహారాలను గుర్తించి చర్యలు తీసుకోకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్య ర్థులు ఓడతారని శ్రేణులంటున్నాయి. మండలంలో పార్టీని చక్కదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

Updated Date - Jun 05 , 2024 | 11:31 PM