Share News

ఎలక్ట్రానిక్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:03 AM

విద్యార్థులకు ఎలక్ట్రానిక్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఐఈటీఈ హైదరాబాద్‌ కార్యదర్శి నులి నమశ్శివాయ అన్నారు..

ఎలక్ట్రానిక్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు
జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఐఈటీఈ హైదరాబాద్‌ కార్యదర్శి నులి నమశ్శివాయ

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 21: విద్యార్థులకు ఎలకా్ట్రనిక్‌ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఐఈటీఈ హైదరాబాద్‌ కార్యదర్శి నులి నమశ్శివాయ అన్నారు. వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీలో గురువారం ఆయన ఐఈటీఈ స్టూడెంట్‌ ఫోరంను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాకా్ట్రనిక్స్‌ విభాగంలో విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. విజ్ఞాన మార్పిడి పెంపొందించుకోవాలని సూచించారు. ఐఈటీఈ స్టుడెంట్‌ ఫోరంకు అంతర్జా తీయ స్థాయిలో గుర్తింపు ఉందని, ఇది విద్యార్థులకు వేదిక కానుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఈటీఈ కోశాధికారి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివా్‌సరావు, అనురాగ్‌ యూనివర్సిటీ డీన్‌లు విజయకుమార్‌, శ్రీనివా్‌సరావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:03 AM