Share News

వ్యవసాయ శాఖలో బదిలీలకు బ్రేక్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:00 AM

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల్లో బదిలీల పరంపర కొనసాగిస్తోంది. అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలు ఉన్న వ్యవసాయ శాఖలో బదిలీలు మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల్లో ఉన్న సందేహాలు నివృత్తిని చేసి పరిష్కరించడంలో వ్యవసాయశాఖ అధికారులు కీలంగా మారారు.

వ్యవసాయ శాఖలో బదిలీలకు బ్రేక్‌

రుణమాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాతే..

తాండూరు రూరల్‌, జూలైౖ 27: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల్లో బదిలీల పరంపర కొనసాగిస్తోంది. అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలు ఉన్న వ్యవసాయ శాఖలో బదిలీలు మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల్లో ఉన్న సందేహాలు నివృత్తిని చేసి పరిష్కరించడంలో వ్యవసాయశాఖ అధికారులు కీలంగా మారారు. ఇప్పటికే రూ.లక్ష రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయనుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖలో తాత్కాలికంగా బదిలీలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. తాండూరు వ్యవసాయ శాఖ డివిజన్‌ పరిధిలో ఏడీ, ఐదుగురు ఏవోలు, 24 మంది ఏఈవోలు ఉన్నారు. కాగా, వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఇప్పటికే వీరందరి వివరాలు సేకరించింది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖల్లో ఇప్పటికే బదిలీలు పూర్తయ్యాయి. అయితే, రుణమాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత బదిలీలు అయ్యే అవకాశం ఉందని ఏడీఏ రుద్రమూర్తి ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 12:00 AM