Share News

చిలుకూరులో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:13 AM

ప్రసద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహోత్సవాలు గురువారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.

చిలుకూరులో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్న అర్చకులు

మొయినాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 18: ప్రసద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహోత్సవాలు గురువారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. బాలాజీ ఆలయంలో ఏటా వారం పాటు జరిగే జరిగే బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేదపండితులు పుట్టమన్నుతో పూజలకు అంకుర్పారణ చేశారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. వేడుకల్లో బాలాజీ ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ సౌందరరాజన్‌, ప్రధానార్చకులు రంగరాజన్‌, ఆలయ కమిటీ సభ్యులు గోపాలకృష్ణపంతులు,స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల రెండో రోజు శుక్రవారం ఉదయం ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహిస్తారు. గరుత్మంతుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని సంతానం కలగని మహిళలకు పంపిణీ చేస్తారు. ఉదయం 5గంటలకే భక్తులు ఆలయానికి చేరుకుంటుండడంతో ప్రధాన ద్వారం వద్ద టెంట్లు వేయనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:22 AM