Share News

భూవివాదం కేసులో ఇద్దరి బైండోవర్‌

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:47 PM

భూవివాదం కేసులో ఇద్దరిని ఘట్‌కేసర్‌ తహసీల్దారు బైండోవర్‌ చేశారు.

భూవివాదం కేసులో ఇద్దరి బైండోవర్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): భూవివాదం కేసులో ఇద్దరిని ఘట్‌కేసర్‌ తహసీల్దారు బైండోవర్‌ చేశారు. మండలంలోని ఎదులాబాద్‌ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్లు 258, 268లలోని 30గుంటల భూమిపై చర్లపల్లి పోలీ్‌సస్టేషన్‌లో హోంగార్డు విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌ గనీ దాయాదులైన మహ్మద్‌ జబ్బార్‌, అతడి తండ్రి అఫ్జల్‌తో వివాదం నెలకొంది. దీంతో ఈ నెల 27న మహ్మద్‌ గనీ పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడంలేదని, ఘట్‌కేసర్‌ సీఐ చాంబర్‌లో డీజిల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ప్రత్యర్థులైన మహ్మద్‌ జబ్బార్‌, అఫ్జల్‌లను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకొని సాయంత్రం తహసీల్దార్‌ ముందు హాజరు పరిచి బైండోవర్‌ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకూడదనే ముందస్తుగా బైండోవర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 11:47 PM