Share News

కనుల పండువగా బొడ్రాయి బోనాలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:43 PM

మండల కేంద్రంలో బొడ్రాయి మొదటి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు.

కనుల పండువగా బొడ్రాయి బోనాలు
బోనాలతో బొడ్రాయి వద్దకు బయలుదేరిన గ్రామస్థులు

షాబాద్‌, జూన్‌ 7 : మండల కేంద్రంలో బొడ్రాయి మొదటి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం డప్పుదరువులతో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతల మధ్య మహిళలు బోనాలతో బొడ్రాయి వద్దక బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు పండేలా చూడాలని గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:43 PM