Share News

రక్తదానం అభినందనీయం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:53 PM

రక్తదానం అభినందనీయమని, రక్తం దానం చేసే వ్యక్తులు ప్రాణదాతలుగా నిలిచిపోతారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు.

రక్తదానం అభినందనీయం: ఎమ్మెల్యే
రక్తదాతలను అభినందిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రక్తదానం అభినందనీయమని, రక్తం దానం చేసే వ్యక్తులు ప్రాణదాతలుగా నిలిచిపోతారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సాయిపూర్‌ ఉర్ధూ ఘర్‌లో జమైతే ఉమ్లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రక్తదాతలను, ఫౌండేషన్‌ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ స్వప్న, స్థానిక కౌన్సిలర్‌ రత్నమాల, కౌన్సిలర్‌ వెంకన్నగౌడ్‌, సీనియర్‌ నాయకులు ధారాసింగ్‌, డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, అబ్దుల్‌ రవూఫ్‌, జమైతే ఉమ్లా ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాలిక్‌, హైమద్‌, షబ్బీర్‌, తదితరులు పాల్గొన్నారు.

రేణుకా నాగఎల్లమ్మను దర్శించుకున్న మనోహర్‌రెడ్డి

తాండూరు పట్టణం గంజ్‌లో కొలువైన రేణుకా నాగఎల్లమ్మను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దర్శించుకున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, చైర్‌పర్సన్‌ స్వప్న, గంజి పెద్దలు పటేల్‌ శ్రీశైలం ఉన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:53 PM