Share News

బీజేపీది మత రాజకీయం

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:13 AM

అధికారాన్ని కాపాడుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు సాగిస్తూ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవి ఆరోపించారు. పదేళ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్‌ సంస్థలకు మేలు జరిగిందే తప్పా.. పేదలకు ఒరగబడిందేమీ లేదని ఆరోపించారు.

బీజేపీది మత రాజకీయం
ఆమనగల్లులో మాట్లాడుతున్న మల్లు రవి

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి ఏప్రిల్‌ 13 : అధికారాన్ని కాపాడుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు సాగిస్తూ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవి ఆరోపించారు. పదేళ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్‌ సంస్థలకు మేలు జరిగిందే తప్పా.. పేదలకు ఒరగబడిందేమీ లేదని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మండల కేంద్రాల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఆయా చోట్ల జరిగిన రోడ్‌ షోలో మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు సతీష్‌ మాదిగ, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్‌, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, లోక్‌సభ ఎన్నికల కల్వకుర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ ఇందిరా శోభన్‌లు పాల్గొన్నారు. ర్యాలీలు, రోడ్‌ షోలలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మల్లు రవి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టాలు తప్పిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సమాధి తప్పదన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ స్కామ్‌లు, స్కీంల పేరుతో దేశాన్ని లూటీ చేశారని, ఓటుద్వారా ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. కసిరెడ్డి మాట్లాడుతూ మల్లు రవికి కల్వకుర్తి నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ ఇచ్చేలా పార్టీ శ్రేణులంతా సైనికుల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు కమ్లీమోత్యనాయక్‌, అనితా విజయ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శులు బీక్యనాయక్‌, అంజయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివా్‌సరెడ్డి, వెంకటేశ్వర్లుగౌడ్‌, భగవాన్‌రెడ్డి, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కేశవరెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు జగన్‌, బీచ్యనాయక్‌, ప్రభాకర్‌రెడ్డి, పట్టణాధఽ్యక్షుడు వస్పుల మానయ్య, జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:13 AM