Share News

వికారాబాద్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:56 PM

రానున్న రోజుల్లో వికారాబాద్‌ మునిసిపల్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవ రెడ్డి అన్నారు.

వికారాబాద్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలి
బీజేపీలో చేరుతున్న డాక్టర్‌ రాజశేఖర్‌

వికారాబాద్‌, జూలై 28: రానున్న రోజుల్లో వికారాబాద్‌ మునిసిపల్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ. ప్రతి వార్డులో బీజేపీని బలపర్చి వచ్చే ఎన్నికల్లో మునిసిపల్‌లో అత్యధిక స్థానాలు పొందే విధంగా కృషి చేయాలన్నారు. మాదవరెడ్డి సమక్షంలో వికారాబాద్‌ మా శారద హాస్పిటల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్‌, పట్టణ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, పాండుగౌడ్‌, పోకల సతీష్‌, విజయ్‌ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

శివాలయ నిర్మాణానికి విరాళం

కులకచర్ల: మండల కేంద్రంలో శివాలయం నిర్మాణానికి కాంగ్రెస్‌ మండల నాయకుడు కర్రె భరత్‌కుమార్‌ విరాళం అందించారు. వీరశైవలింగాయత్‌ సభ్యులకు ఆదివారం రూ.లక్ష అందించడంతో కర్రె భరత్‌కుమార్‌ దంపతులను వారు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీరశైవలింగాయత్‌ సభ్యులు ప్రకాశ్‌, సుంకరి వినోద్‌, శంకర్‌, శ్రీప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:56 PM