Share News

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:27 AM

రోగులకు మెరుగైన సేవలందించాలని ఎంపీపీ కొప్పు సుకన్యబాషా అన్నారు. మంగళవారం ఆమె యాచారంలోని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారు? వైద్యసేవలు ఎలా అందిస్తున్నారు? తదితర విషయాలపై ఆరా తీశారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

యాచారం, ఫిబ్రవరి 27 : రోగులకు మెరుగైన సేవలందించాలని ఎంపీపీ కొప్పు సుకన్యబాషా అన్నారు. మంగళవారం ఆమె యాచారంలోని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారు? వైద్యసేవలు ఎలా అందిస్తున్నారు? తదితర విషయాలపై ఆరా తీశారు. డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. కొత్తగా 9 మంది నర్సులు ఆస్పత్రిలో విధుల్లో చేరడంతో వారిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పల్లె వైద్యశాలల్లో తగిన వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం 10.30గంటలకు వైద్యులు ఆసుపత్రులకు వచ్చేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి రోగులను ఆదుకోవాలన్నారు. వైద్యసిబ్బంది తరచూ గ్రామాలను సందర్శించి రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో రోగులకు తాగు నీటి వసతి కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:27 AM