Share News

రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:37 PM

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఫోర్త్‌సిటీలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ
అర్జున్‌ మురళిని అభినందిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఫోర్త్‌సిటీలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్‌లోని టూథియానాలో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌ అండర్‌-14 పోటీల్లో ఆమనగల్లు మున్సిపాలిటీ నగారాగడ్డ తండాకు చెందిన అర్జున్‌ మురళి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రజక పతకం సాధించాడు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం అర్జున్‌ మురళిని సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించడం తెలంగాణకు గర్వకారణమని కసిరెడ్డి అన్నారు. క్రీడాకారుని తండ్రి మురళి మోహన్‌ను ఎమ్మెల్యే సత్కరించారు. పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు మండ్లీ రాములు, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు జగన్‌, ఆమనగల్లు ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్‌ కేశవులు, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు మానయ్య, నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, రమేశ్‌గౌడ్‌, తదితరులున్నారు. అలాగే ఆమనగల్లు పట్టణంలో దివంగత కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి, మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి, మాజీ ప్రధాని మన్మోన్‌ సింగ్‌ల విగ్రహాల ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయించాలని కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈమేరకు ఆయనకు వినతిపత్రం అందజేయగా అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 28 , 2024 | 11:37 PM