Share News

బురదజల్లే ఆరోపణలు మానుకోండి

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:53 PM

కాంగ్రెస్‌ నాయకులపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న బురదజల్లే ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎస్‌బీ పల్లి మాజీ సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్‌రెడ్డిలు హితవు పలికారు.

బురదజల్లే ఆరోపణలు మానుకోండి

బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ నాయకుల హితవు

కొత్తూర్‌, ఫిబ్రవరి 2 : కాంగ్రెస్‌ నాయకులపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న బురదజల్లే ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎస్‌బీ పల్లి మాజీ సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్‌రెడ్డిలు హితవు పలికారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని జడ్పీటీసీ శ్రీలతసత్యనారాయణ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ నాయకులు స్పందించారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రొటోకాల్‌ పాటించని సంస్కృతి బీఆర్‌ఎ్‌సదే తప్ప.. కాంగ్రె్‌సది కాదన్నారు. ఎస్‌బీపల్లిలో ఇటీవల రూ.10లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనం శంకుస్థాపనకు జడ్పీటీసీతో పాటు, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్‌ ప్రకారం సమాచారం అందిందని, ఇందుకు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయన్నారు. తాము అందుబాటులోలేమని చెప్పిన బీఆర్‌ఎస్‌ నాయకులు.. తప్పుడు కూతలు కూస్తూ, లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. వీర్లపల్లి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పూర్తిస్థాయిలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవిస్తున్నామని, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు పనిగా పెట్టుకున్నారన్నారు. ఎస్‌బీపల్లి అభివృద్ధికి రూ.30లక్షల సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధి జరగకుండా జడ్పీటీసీ పలుమార్లు అడ్డుకుందని, తాము కాంగ్రెస్‌కు చెందినందుకు బీఆర్‌ఎస్‌ హయాంలో కక్షసాధింపులకు పాల్పడలేదా అని అన్నారు. నాయకులు వీరమోని దేవేందర్‌ముదిరాజ్‌, రాందా్‌సనాయక్‌, కర్రొళ్ల సురేందర్‌, నవీన్‌చారి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:53 PM