చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jul 10 , 2024 | 12:29 AM
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతంగా చదువుకోవాలని చేవెళ్ల కోర్టు సీనియర్ సివిల్ న్యాయాధికారి దశరథ రామయ్య సూచించారు.
సీనియర్ సివిల్ న్యాయాధికారి దశరథ రామయ్య
చేవెళ్ల, జూలై 9 : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతంగా చదువుకోవాలని చేవెళ్ల కోర్టు సీనియర్ సివిల్ న్యాయాధికారి దశరథ రామయ్య సూచించారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్‌స్కూల్, జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ నిరోధక చట్టం, విద్యార్థులకు రక్షణ, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసంద్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కళాశాలలోచదువుకునే విద్యార్థులు తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమన్నారు. డ్రక్స్ తీసుకుని జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు. చెడు వ్యసనాలు, ఆలవాట్లకు దూరంగా ఉండి బాగా చదువుకుని సమాజాభివృద్దిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సీఐ. భూపాల్ శ్రీధర్, పాఠశాల ప్రిన్సిపాల్ టేనవతి, బార్‌అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి, లీగల్ కౌన్సిల్ కుమార్, నవ్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.