ఆడపడుచుగా అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి
ABN , Publish Date - May 12 , 2024 | 12:16 AM
మీ ఇంటి ఆడపడుచుగా అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఎంపీగా గెలిపించాలని మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి ఓటర్లకు కోరారు.

మేడ్చల్, మే 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఘట్‌కేసర్: మీ ఇంటి ఆడపడుచుగా అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఎంపీగా గెలిపించాలని మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి ఓటర్లకు కోరారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు శనివారం మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా రోడ్‌షోలు నిర్వహించి మాట్లాడుతూ మల్కాజిగిరి అభివృద్ధే ఎజెండాగా తాను ఐదేళ్లు పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సహకారం, కేంద్రంలో ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వ సహకారంతో మల్కాజిగిరి ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. తాను 18 ఏళ్లుగా జడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రజల మద్య ఉండి పనిచేస్తున్నానన్నారు. బీజేపీ అభ్యర్థిఅభివృద్ది మాట మరిచి దేవుడి పేరుతో ఓట్లు అడుకుంటున్నారని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 500బైక్‌లతో కార్యకర్తలు కొండాపూర్ నుంచి ఘట్‌కేసర్‌లోని బాలాజీ నగర్, అంబేడ్కర్‌నగర్, ఎన్‌ఎ్‌ఫసీనగర్, బొక్కోనిగూడ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్, యాదగిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య, కొంతం అంజిరెడ్డి, ముత్యాలు, రాదాకృష్ణ, సాయి , వెంకటేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.