Share News

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:57 PM

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 13: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపల్‌, అన్నోజిగూడ లక్ష్మినర్సింహా కాలనీకి చెందిన నానావత్‌ వినోద అలియాస్‌ లక్ష్మి నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటిపై దాడిచేశారు. ఆమె వద్ద నుంచి మొత్తం 88మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వినోదను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - Apr 13 , 2024 | 11:57 PM