Share News

భూకబ్జాకు యత్నించిన నిందితుడి అరెస్టు

ABN , Publish Date - May 23 , 2024 | 11:43 PM

నకిలీ డాక్యుమెంట్‌తో భూకబ్జాకు యత్నించిన వ్యక్తిని కీసర పోలీసులు అరెస్టు చేశారు.

 భూకబ్జాకు యత్నించిన నిందితుడి అరెస్టు

కీసర రూరల్‌, మే 23: నకిలీ డాక్యుమెంట్‌తో భూకబ్జాకు యత్నించిన వ్యక్తిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌ మండలం రేణిగుంట గ్రామానికి చెందిన సత్తు మహేష్‌ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రగతినగర్‌లో నివాసముంటున్నాడు. అతడితో పాటు మరికొంత మంది పాషాబాయి, వీరభద్రరావు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి కీసర మండలం గోధుమకుంట రెవెన్యూ సర్వే నెంబర్‌ 157, 136 -1677లో ఏర్పాటు చేసిన టీపీఎస్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఫ్లాట్‌ నెంబర్‌ 57, 58లోని 532చదరపు గజాల స్థలాన్ని కొట్టేయాలని పథకం వేశారు. ఇందుకు నకిలీ దస్తావేజును సృష్టించి అంకం వీరభద్రరాజు పేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆన్‌లైన్‌లో ఈసీ సెర్చ్‌ చేయగా వారి ప్లాట్‌ నంబర్‌పైన అసలైన యజమానికి బదులుగా మరొకరి పేరు వస్తోంది. దీంతో అనుమానం వచ్చిన యజమాని కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు కూపీ లాగారు. అందులో భాగంగా వీరభద్రరావును గతంలోనే అరెస్టు చేయగా గురువారం సత్తు మహే్‌షను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - May 23 , 2024 | 11:43 PM