Share News

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 23 , 2024 | 12:00 AM

మేడ్చల్‌లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేశామని మేడ్చల్‌ పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షల కోఆర్డినేటర్‌, కాలేజీ ప్రిన్సిపాల్‌ జి.అరుధతి బుధవారం తెలిపారు.

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు

మేడ్చల్‌ టౌన్‌, మే 22 : మేడ్చల్‌లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేశామని మేడ్చల్‌ పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షల కోఆర్డినేటర్‌, కాలేజీ ప్రిన్సిపాల్‌ జి.అరుధతి బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 24న నిర్వహిస్తున్నామని, ఉదయం 11 నుంచి మతిధ్యాహ్నం 1:30గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణకు మేడ్చల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎన్‌ఎ్‌సఆర్‌ కళాశాల, స్ఫూర్తి కళాశాల, ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల, ప్రభుత్వ ఐటీఐ, హైటెక్‌ పాఠశాల, హైటెక్‌ మోడర్న్‌ స్కూళ్లలో 8సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పాలిటెక్నిక్‌లోని మూడు సంవత్సరాల కోర్సులకు ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లమా కోర్సులతో పాటు, వ్యవసాయ డిప్లమా, వెటర్నరీ డిప్లమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థులను గంట ముందు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సీఎంఆర్‌ షీట్‌లను రెండు వైపులా నింపి ఇవ్వాలని తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 08:56 AM