Share News

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 07 , 2024 | 11:53 PM

ఈ నెల 13 నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అఽధికారి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌ తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో సూరజ్‌కుమార్‌

కందుకూరు, మే 7 : ఈ నెల 13 నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అఽధికారి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆర్‌డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో మాట్లాడారు. నియోజకవర్గంలో 537 పోలింగ్‌ కేద్రాలున్నాయన్నారు. వాటిల్లో 56 కేంద్రాలను సమస్యాత్మ బూత్‌లుగా గుర్తించామన్నారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో 36 సెక్టార్లు ఉండేవని, ప్రస్తుతం వాటిని 50రి పెంచామన్నారు. ఇప్పటి వరకు 98శాతం మంది ఓటర్లకు ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ నెల 12న సాయంత్రం నాదర్‌గుల్‌లోని స్ఫూర్తి ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి అన్ని పోలింగ్‌ కేంద్రాలను ఈవీఎం లు, వీవీ ప్యాట్లు, సీయూ తదితర ఎన్నికల సామగ్రిని డిస్ర్టిబ్యూట్‌ చేసి పోలి ంగ్‌ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా పోలింగ్‌ కేంద్రాల్లో తాగు నీరు, లైటింగ్‌ తదితర వసతులను కల్పిస్తున్న ట్టు తెలిపారు. 12 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 4,624 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఉన్నారని, 234 మంది హోం ఓటర్లు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. వీరు ఈ నెల 8వ తేదీ వరకు ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియాన్ని ఎల్బీనగర్‌ నియోజకవర్గానికి సంబంధించి స్ర్టాంగ్‌ రూమ్‌ గా వాడుకుంటున్నందున అక్కడ ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదన్నారు. ప్రత్యామ్మాయంగా విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ మైదానంలో రాజకీయ పార్టీలకు సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఇందుకు దరఖాస్తు చేసుకున్న అనుమతులు ఇస్తామని తెలిపారు. సమావే శంలో ఎన్నిల డిప్యుటీ తహసీల్దార్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 11:53 PM