Share News

పోలీ్‌సస్టేషన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తల వాగ్వాదం

ABN , Publish Date - May 22 , 2024 | 11:55 PM

బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన పూడూరు మండలం చెన్‌గోముల్‌ పోలీసుస్టేషన్‌ వద్దచోటు చేసుకుంది.

పోలీ్‌సస్టేషన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తల వాగ్వాదం

పూడూరు, మే 22 : బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన పూడూరు మండలం చెన్‌గోముల్‌ పోలీసుస్టేషన్‌ వద్దచోటు చేసుకుంది. కడ్మూరుకు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 13న పోలింగ్‌ నేపథ్య ంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సురేష్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీం తో పోలీసులు కడ్మూరుకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ నాయకులను బుధవారం అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమకు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. వారిని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. విచారణకు సహరించాలని డీఎస్పీ వారికి సూచించి గ్రామానికి పంపించారు.

Updated Date - May 22 , 2024 | 11:55 PM