Share News

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:58 PM

యువకులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
పెద్దేముల్‌లో ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

పెద్దేముల్‌, మార్చి 24: యువకులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దేముల్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బ్యాటింగ్‌ చేయగా కాంగ్రెస్‌ నాయకులు బౌలింగ్‌ చేశారు. అనంతరం యువతను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు గ్రామీణస్థాయి క్రీడల నుంచి జాతీయ స్థాయి వరకు ఎదగాలని కోరారు. అందుకు నిరంతర సాధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం నుంచి తగిన పోత్సాహం అందేవిధంగా కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నారాయణరెడ్డి, ఉప్పరి మల్లేశం, నాయకులు రుద్రారం మహిపాల్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, కొమ్ము గోపాల్‌రెడ్డి, డివై.నర్సింహులు, హర్షవర్దన్‌రెడ్డి, మైఫుస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన బెల్కటూర్‌ వాసులు

తాండూరు రూరల్‌: తాండూరు మండలం బెల్కటూర్‌ గ్రామానికి చెందిన అంబేద్కర్‌ నగర్‌ ఎస్సీ కాలనీ వాసులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను కలిసి స్మశానవాటిక, కమ్యూనిటీ హాల్‌, రేణుక ఎల్లమ్మ ఆలయం పునఃనిర్మాణం తదితర సమస్యలపై వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకులంగా స్పందించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇట్టి సమస్యలను ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్లె నర్సింహులు, జెట్టపరి వెంకటేష్‌, మామిడిగళ్ల జెగ్గప్ప, జెట్టపరి సైప్ప, మాల నర్సప్ప, శామప్ప ఉన్నారు.

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

యాలాల: యాలాల గ్రామానికి చెందిన రాజు కుమారుడు వెంకట సాయి వివాహానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, మురళీకృష్ణగౌడ్‌, ప్రభాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:58 PM