Share News

విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:54 PM

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఐసీఎస్‌ అధికారి బోయల్‌ డేవిస్‌ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్‌లోని రావ్‌వుడ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
పాఠశాల వార్షికోత్సవంలో సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు

ఘట్‌కేసర్‌, జనవరి 12: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఐసీఎస్‌ అధికారి బోయల్‌ డేవిస్‌ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్‌లోని రావ్‌వుడ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు తదితర విభాగాల్లో ప్రావీణ్యం పొందాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ వి.శేషగిరిరావు, ప్రొఫెసర్‌ షకీల్‌ అహ్మద్‌, విధుర లెర్నింగ్‌ సీఈవో ఆదిత్యకుమార్‌, బాల్‌రాజ్‌నాయుడు, సీఐ అశోక్‌రెడ్డి, పాఠశాల చైర్మన్‌ రామానాయుడు, సీఈవో సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎం శ్రీరంజని, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:54 PM