Share News

అప్పులబాధఅన్నదమ్ముల మధ్య గొడవలో అన్న మృతి

ABN , Publish Date - Jun 22 , 2024 | 11:55 PM

అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో అన్న మృతి చెందిన సంఘటన మోమిన్‌పేట్‌ మండలంలో చోటుచేసుకుంది.

అప్పులబాధఅన్నదమ్ముల మధ్య గొడవలో అన్న మృతి

మోమిన్‌పేట్‌, జూన్‌ 22: అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో అన్న మృతి చెందిన సంఘటన మోమిన్‌పేట్‌ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాతకొల్కుంద గ్రామానికి చెందిన బండారి నర్సింహులు, శ్రీనివాస్‌(35), రాజశేఖర్‌ ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురికీ పెళ్లిళ్లు కాగా ఒకే ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే, శుక్రవారం రాత్రి తమ్ముడు రాజశేఖర్‌ ఇంటికి వచ్చేసరికి అన్న శ్రీనివాస్‌.. రాజశేఖర్‌ గది నుంచి బయటకు వస్తున్నాడు. దీంతో తన గది తాళాలు పగులగొట్టి డబ్బులు దొంగలించాడనే అనుమానంతో శ్రీనివా్‌సతో రాజశేఖర్‌ గొడవకు దిగాడు. ఇద్దరూ 8గంటల ప్రాంతంలో గొడవపడగా ఇరువురిని అన్నయ్య నర్సింహులు మందలించడంతో ఎవరిగదిలోకి వారు వెళ్లారు. అనంతరం రాత్రి 10గంటలకు శ్రీనివాస్‌, రాజశేఖర్‌లు మళ్లీ గొడవపడ్డారు. రాజశేఖర్‌ కర్రతో దాడి చేయగా శ్రీనివాస్‌ తలకు, చేతులకు, కాళ్లకు, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. రాత్రిపూట అందరూ నిద్రిస్తుండటంతో శ్రీనివా్‌సను ఎవరూ గమనించలేదు. ఉదయం చూసేసరికి శ్రీనివాస్‌ తీవ్రగాయాలతో కనిపించడంతో వారి అన్న నర్సింహులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. శ్రీనివా్‌సకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య స్వప్న భర్తతో మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్లుగా పిల్లలతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ అరవింద్‌ తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 11:55 PM