Share News

సంస్కారవంతంగా అమ్మ పాదపూజ

ABN , Publish Date - May 20 , 2024 | 12:00 AM

ఆమనగల్లులో అమ్మ పాదపూజ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

సంస్కారవంతంగా అమ్మ పాదపూజ
తల్లిదండ్రులకు పాదపూజ చేస్తున్న విద్యార్థులు

పెద్ద ఎత్తున పాల్గొన్న తల్లిదండ్రులు

ఆమనగల్లు, మే 19 : ఆమనగల్లులో అమ్మ పాదపూజ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్‌, శ్రుతిలయ కల్చరల్‌ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి సంగీత, నృత్య శిక్షణ శిబిరంలో భాగంగా తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ లలితవెంకటయ్య, శ్రుతిలయ కల్చరల్‌ అకాడమీ చైర్మన్‌ దార్ల చిత్తరంజన్‌, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, సంఘ సేవకుడు పాపిశెట్టి రాము, వందేమాతరం ఫౌండేషన్‌ జిల్లా అధ్యక్షుడు నర్సిరెడ్డిలతో కలిసి ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎడ్మ మాధవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. చిత్తరంజన్‌ దాస్‌ బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎడ్మ మాధవ రెడ్డి, నర్సిరెడ్డి, రాము మాట్లాడుతూ ప్రతీ మనిషికి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, కన్నవారి కోసం వారు చేసే త్యాగాలు వెలకట్టలేనివన్నారు. తల్లిదండ్రుల ప్రేమకు వేరెవరూ సాటిరారన్నారు. వేసవి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్తరంజన్‌దా స్‌ను అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్‌, ఫౌండేషన్‌ సభ్యులు ధనలక్ష్మమ్మ, అభినవ్‌రెడ్డి, శ్రీశైలం, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:00 AM