Share News

అగ్రికల్చర్‌ వర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించడం సరికాదు

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:51 PM

అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు కు కేటాయించడం సరైనది కాదని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో తీర్మానించారు.

అగ్రికల్చర్‌ వర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించడం సరికాదు

ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌

శంషాబాద్‌, ఫిబ్రవరి 2 : అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు కు కేటాయించడం సరైనది కాదని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో తీర్మానించారు. ఈమేరకు శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.శివ, గ్యార క్రాంతిలు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు మారితే యూనివర్సిటీలకు మేలు జరుగుతుందనుకుంటే.. భవిష్యత్‌ తరాల విద్యార్థులకు పరిశోధనా కేంద్రాలుగా ఉన్నవాటిని అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు కేటాయించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. యునివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయం పరిగణలోకి తీసుకోకుండా ఇదంతా జరిగిందా? లేదా అక్కడ ఉన్న వీసీ, రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్లు స్పందించలేదా? అని ప్రశ్నించారు. నిర్ణయాన్ని వెనక్కితీసుకోకపోతే రాష్ట్రం, కేంద్రంలో వామపక్ష విద్యార్థి, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో శ్రీకాంత్‌, అజయ్‌, విజయ్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:51 PM