Share News

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించండి

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:16 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించాల్సిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈమేరకు ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో షాద్‌నగర్‌, పరిగి, చేవెళ్ళ, తాండూరు ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్‌, డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డిలు కలిసి వినితి పత్రాన్ని ఇచ్చారు.

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించండి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రాన్ని ఇస్తున్న ఎమ్మెల్యేలు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యేల వినతి

షాద్‌నగర్‌ అర్బన్‌/పరిగి, జూలై 14: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించాల్సిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈమేరకు ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో షాద్‌నగర్‌, పరిగి, చేవెళ్ళ, తాండూరు ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్‌, డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డిలు కలిసి వినితి పత్రాన్ని ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిజైన్‌ను మార్చి నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివేన, ఉదండాపూర్‌ రిజర్వాయర్ల నిర్మాణ పనులను ప్రారంభించి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పక్కన పెట్టిందని మంత్రికి గుర్తుచేశారు. షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని చౌదరిగూడెం మండలంలో గల లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తే షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సైతం సాగునీరు పారుతుందని, తాగునీటి సమస్య కూడా తీరుతుందని మంత్రికి వివరించారు. వచ్చే బడ్జెట్‌లోనే నిధులు కేటాయించి, నిర్మాణ పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన కొందర్గు-పరిగి-లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు జిల్లాకు సాధించి తీరుతామని, గత ప్రభుత్వం ప్రాజెక్టును విస్మరించిందని, చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ను దారి మళ్లించి జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నారు. వికారాబాద్‌ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వరకు సాగునీరు అందనుందని తెలిపారు. పాలమూరు ఎత్తిపాతల ద్వారా ఏడాదిలోపు నీరు తీసుకవస్తామని, చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా కూడా సాగునీరు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:16 AM