Share News

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:03 AM

నేడు జరగనున్న లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఓట్లను చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బీఎ్‌సఐటీ కాలేజీలో ఓట్లు లెక్కించనున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపును మూడు కేంద్రాల్లో చేపట్టనున్నారు. మేడ్చల్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల లెక్కింపును కీసరలోని హోళీమేరీ ఇంజనీరింగ్‌ కాలేజీలో, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును సరూర్‌నగర్‌ స్టేడియంల, కంట్మోనెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓట్లను వెస్లీ కాలేజీలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రత

నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

బీఎస్‌ఐటీలో చేవెళ్ల పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు

మూడుచోట్ల లెక్కించనున్న మల్కాజిగిరి పార్లమెంట్‌ ఓట్లు

మొదటగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

చేవెళ్ల పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపునకు 165 టేబుళ్లు, 150 రౌండ్లు

మల్కాజిగిరిలో 158 టేబుళ్లు.. 141 రౌండ్లు

రాజకీయ ఏజెంట్ల సమక్షంలో తెరవనున్న స్ర్టాంగ్‌రూమ్స్‌

రంగారెడ్డి అర్బన్‌/మేడ్చల్‌ (ఆంధ్రజ్యోతి). జూన్‌ 3 : నేడు జరగనున్న లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఓట్లను చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బీఎ్‌సఐటీ కాలేజీలో ఓట్లు లెక్కించనున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపును మూడు కేంద్రాల్లో చేపట్టనున్నారు. మేడ్చల్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల లెక్కింపును కీసరలోని హోళీమేరీ ఇంజనీరింగ్‌ కాలేజీలో, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును సరూర్‌నగర్‌ స్టేడియంల, కంట్మోనెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓట్లను వెస్లీ కాలేజీలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఉదయం 8 గంటలకు లెక్కింపు షురూ..

నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచేల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ సిబ్బందిని నేటి ఉదయం 5.30 గంటల్లోగా అబ్జర్వర్‌ సమక్షంలో ర్యాండమైజేషన్‌ చేసి టేబుల్‌ వారీగా కేటాయించనున్నారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్వైజర్‌, కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్‌ను నియించారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం స్ట్రాంగ్‌ రూములను తెరవనున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు

చేవెళ్ల, : కౌంటింగ్‌ కేంద్రాన్ని సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కఠారియా, కౌంటింగ్‌ పరిశీలకులు మృణాళిని సావంత్‌, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డిలతో కలిసి రిటర్నింగ్‌ అధికారి శశాంక పరిశీలించారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు చేవెళ్ల మండలం గొల్లపల్లి పరిధిలో ఉన్న బండారు శ్రీనివాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను అధికారులు సోమవారం పరిశీలించారు. అలాగే ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ పక్రియను నిబంధనల మేరకు అబ్జర్వర్ల సమక్షంలో పూర్తిచేశారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఈ పక్రియను స్ర్కీన్‌పై చూపించారు. మూడో విడత ర్యాండమైజేషన్‌ పక్రియ నేడు ఉదయం 5గంటలకు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే కలెక్టర్‌, ఇతర అధికారులు సోమవారం ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ హాల్‌ను సందర్శించారు. ఆయా కౌంటింగ్‌ హాళ్లలో టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని రిటర్నింగ్‌ అధికారి సహాయ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ప్రతీ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు జరగకుండా నిబంధనలను పాటించాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్‌ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ, ప్రతి రౌండ్‌కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్‌ ప్రక్రియను యధాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన వారికి పాసులు అందించాలని, పాసు కలిగి ఉన్న వారినే కౌంటింగ్‌ సెంటర్‌ లోనికి అనుమతించాలని సూచించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, అవసరమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ పరిశీలనలో రిటర్నింగ్‌ అధికారి వెంట అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, చేవెళ్ల డీసీపీ శ్రీనివాస్‌, అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్‌ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పాస్‌లు ఉంటేనే అనుమతి...

చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించిన కౌంటింగ్‌ పాస్‌లు ఉంటేనే లోపాలకి అనుమతి ఉంటుందని చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. పాస్‌లు లేనివారిని ఎట్టిపరిస్థితిలో లోపలికి అనుమతించబడదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా బండారు శ్రీనివాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో వాహనాల కోసం ఆరు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. ఇందులో వీపీఐలు, పార్టీనాయకులు, అధికారులు, మీడియాకు తదితర పార్కింగ్‌ స్థలాలు వేర్వురుగా ఏర్పాటు చేశారు

గంటకు నాలుగు రౌండ్లు...

ఒక్కో రౌండుకు 10 నుండి 15 నిమిషాల సమయం పడుతుంది. గంటకు నాలుగు రౌండ్లు పూర్తవుతాయి. ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే రౌండ్ల వారీగా ఓట్లను క్రోడీకరించి ఫలితం ప్రకటిస్తారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో అత్యధికంగా 21 రౌండ్ల లెక్కింపు జరుగనుండటంతో 5 గంటలకు పైగా సమయం తీసుకోనుంది. ఆ తర్వాతే తుది ఫలితం వెలువడనుంది.

భారీ బందోబస్తు....

ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆద్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 650 మంది పోలీ్‌సలతో కూడిన మూడంచెల పోలీస్‌ భద్రత కుట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డీసీపీ, ఒక అడిషినల్‌ డీసీపీ, 7 ఏసీపీలు, 16 మంది సీఐలు, 41 మంది ఎస్సైలు, 80 మంది ఏఎస్సైలు, 40 మంది మహిళా కానిస్టేబుల్స్‌, మరో 250 మంది పోలీస్‌ కానిస్టేబుల్స్‌లు, వీరితోపాటు 150 మంది రిజర్వు పోలీస్‌ ఉంటారని చేవెళ్ల ఏసీపీ బంటు కిషన్‌ స్పష్టం చేశారు. మూండెచల పోలీస్‌ బందోబస్తుకొనసాగుతుందన్నారు.

వాహనాల దారిమళ్లింపు....

పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు సందర్భంగా చేవెళ్ల మండలం నుంచి శంకర్‌పల్లి వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. చేవెళ్ల మండల కేంద్రం నుంచి ఊరెళ్ల గ్రామం మీదుగా ఎన్కెపల్లి చౌరస్తా వరకు వాహనాలు వెళ్లే విధంగా పోలీస్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం బండారు శ్రీనివాస్‌ కళాశాల వరకు ఇతర భారీ వాహనాలు తప్ప, ఇతర వాహనాలకు అనుమతి లేదని పోలీ్‌సలు స్పష్టం చేశారు.

చేవెళ్ల లెక్కింపు ఇక్కడే..

మహేశ్వరం నియోజకవర్గం ఓట్ల లెక్కింపును గొల్లపల్లిలోని బీఎ్‌సఐటీ కాలేజీ బ్లాక్‌ బి’లోని 1వ అంతస్తులో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం బ్లాక్‌ ఎ’లోని 2వ అంతస్తులో, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ బి లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో, చేవెళ్ల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ ఎ’లోని 1వ అంతస్తులో, పరిగి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ బి’లోని 2వ అంతస్తులో, వికారాబాద్‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ బి’లోని 2వ అంతస్తులో, తాండూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ బి’లోని 3వ అంతస్తులో కొనసాగనుంది. అదే విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు బ్లాక్‌ ఎ’లోని 1వ అంతస్తులో జరగనుంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి 777 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వారి కోసం రాజేంద్రనగర్‌ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ఇప్పటికే వీరందరికి శిక్షణ పూర్తి చేశారు. వీరంతా నేటి ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకుంటారు. అబ్జర్వర్‌ సమక్షంలో ఐదు వీవీ ప్యాట్స్‌ ర్యాండమ్‌గా ఎంపిక చేసి స్లిప్పులను లెక్కించనున్నారు. ప్రతీ రౌండ్‌ పూర్తవగానే ఎంకోర్‌ యాప్‌లో డేటా నమోదు చేయనున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద అఫీషియల్‌ కమ్యూనికేషన్‌ రూమ్‌, మీడియా సెంటర్‌, పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ కేంద్రాలలోకి ఎలాంటి వస్తువులు, మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి అల్పాహారం, భోజనాల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఓట్ల లెక్కింపునకు 1,150 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం

కౌంటింగ్‌ సిబ్బంది వివరాలు

కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు :227

కౌంటింగ్‌ అసిస్టెంట్స్‌ :273

మైక్టో అబ్జర్వర్లు :277

మొత్తం కౌంటింగ్‌ సిబ్బంది :777

పోలింగ్‌ స్టేషన్లు :2,877

ఓట్ల వివరాలు మొత్తం ఓట్లు పోలైనవి

పురుషులు 15,04,260 8,53,237

మహిళలు 14,33,830 8,03,827

ఇతరులు 280 43

మొత్తం ఓట్లు 29,38,370 16,57,107

పోలింగ్‌ శాతం :56.40

టేబుళ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఇలా

నియోజకవర్గం పోలైన ఓట్లు టేబుళ్లు రౌండ్లు

మహేశ్వరం 2,93,472 28 20

రాజేంద్రనగర్‌ 3,31,318 28 20

శేరిలింగంపల్లి 3,32,853 28 23

చేవెళ్ల 1,93,911 14 22

పరిగి 1,78,637 14 22

వికారాబాద్‌ 1,63,167 14 21

తాండూరు 1,63,743 14 20

పోస్టల్‌ ఓటు 19,290(పీబీఎస్‌) 24+1 02

============

మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం

కౌంటింగ్‌ సిబ్బంది వివరాలు

కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు :178

కౌంటింగ్‌ అసిస్టెంట్స్‌ :205

మైక్టో అబ్జర్వర్లు :192

మొత్తం కౌంటింగ్‌ సిబ్బంది :575

ఓట్ల వివరాలు

మొత్తం ఓట్లు పోలైనవి

పురుషులు 19,45,624 9,95,791

మహిళలు 18,33,430 9,23,206

ఇతరులు 542 134

మొత్తం ఓట్లు 37,79,596 19,19,131

పోలింగ్‌ శాతం 50.78

=========

టేబుళ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఇలా

నియోజకవర్గం పోలైన ఓట్లు టేబుళ్లు రౌండ్లు

మేడ్చల్‌ 3,96,970 28 21

మల్కాజిగిరి 2,64,189 20 21

కుత్భుల్లాపూర్‌ 3,99,752 28 21

ఉప్పల్‌ 2,72,870 20 20

కూకట్‌పల్లి 2,49,894 20 21

కంటోన్మెంట్‌ 1,24,517 14 17

ఎల్‌బీనగర్‌ 2,95,131 28 20

పోస్టల్‌ ఓట్లు 20 02

Updated Date - Jun 04 , 2024 | 12:05 AM